పెద్దపెల్లి శ్రావణ్

పెద్దపెల్లి శ్రావణ్ భారతీయ యువకుల దళం (BYD) పార్టీ జాతీయ అధ్యక్షుడు.

పెద్దపెల్లి శ్రావణ్ ఎం.టెక్ గ్రాడ్యుయేట్ మరియు వ్యాపారవేత్త. 2023లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (25 - తెలంగాణ) నుండి ఎమ్మెల్యేగా మరియు 2024లో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం (3 - తెలంగాణ) నుండి ఎంపీగా పోటీ చేశారు.

రాజకీయ ప్రయాణం:

సెప్టెంబర్ 2023

భారతీయ యువకుల దళం పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు.

డిసెంబర్-2023

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (25 - తెలంగాణ) ఎమ్మెల్యేగా పెద్దపెల్లి శ్రావణ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1143 ఓట్లు సాధించారు.

ఏప్రిల్ 2024

భారత ఎన్నికల సంఘం భారతీయ యువకుల దళం పార్టీని 19.04.2024 నుండి రాజకీయ పార్టీగా ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు గా పెద్దపెల్లి శ్రావణ్ ను ఆమోదించారు.

జూన్-2024

కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం (3 - తెలంగాణ) ఎంపీగా పెద్దపెల్లి శ్రావణ్ భారతీయ యువకుల దళం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 3074 ఓట్లు సాధించారు.